Rolls royce: ఆ కారు క్రాష్ టెస్ట్ ఎందుకు చేయరో తెలుసా.. ప్రపంచంలో సెఫ్టీ రేటింగ్ లేని కారు అదే..
ABN , Publish Date - Dec 08 , 2024 | 09:58 AM
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ కు చెందిన లగ్జరీ కార్లకు సేఫ్టీ రేటింగ్ ఎందుకు ఉండదని ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ కార్లు ఎందుకు క్రాష్ టెస్ట్ చేయబడవు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ మిస్టరీ వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ కార్లు ప్రత్యేకమైన ..
కారు లేదా మరెదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను కచ్చితంగా చూస్తారు. కారు కొనుగోలు చేసే ముందు దాని సేఫ్టీ రేటింగ్‌ని చూడడం ఎంతో ముఖ్యం. ప్రతి సంవత్సరం అనేక కార్లు క్రాష్ టెస్ట్ పూర్తిచేసుకున్న తర్వాత వాటికి సెఫ్టీ రేటింగ్స్ ఇస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ కు చెందిన లగ్జరీ కార్లకు సేఫ్టీ రేటింగ్ ఎందుకు ఉండదని ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ కార్లు ఎందుకు క్రాష్ టెస్ట్ చేయబడవు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ మిస్టరీ వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ కార్లు ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉంటాయి. విలాసవంతమైన ఇంటీరియర్స్, అధిక నాణ్యతతో పాటు లగ్జరీ కార్లకు రోల్స్ రాయిస్ ప్రసిద్ధి. ఈ కార్లు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మాత్రమే వినియోగిస్తారు. వ్యక్తుల ఆర్థిక స్థోమత ఆధారంగానే ఈ కంపెనీ తమ కార్లను విక్రయిస్తుంది. ఆర్డర్ తీసుకున్న తర్వాత కొనుగోలుదారుడి అభిరుచులకు అనుగుణంగా ఈ కార్లను తయారుచేస్తారు. అన్ని కార్లు ఒకే విధంగా ఉండవు. భద్రత విషయానికి వస్తే ఈ కార్ల గురించి ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. కోల్స్ రాయిస్ కార్లు ఎందుకు క్రాష్ టెస్ట్ చేయబడవు ? ఇతర కార్ కంపెనీలు తమ కార్ల భద్రత విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ సంస్థ తయారుచేసే కార్లకు క్రాష్ టెస్ట్ చేయించుకుంటాయి.
గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్‌పిఎపి) అనే సంస్థ కార్ల క్రాష్ టెస్ట్‌లు చేస్తుంది. భారత్‌లోనూ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ పూర్తైన కార్లకు సెఫ్టీ రేటింగ్స్ ఇస్తారు. కారులో వాడిన మెటీరియల్, భద్రతా ప్రమాణాల ఆధారంగా క్రాష్ టెస్ట్ నివేదికతో సెఫ్టీ రేటింగ్స్ ఇస్తారు. అదే సమయంలో రోల్స్ రాయిస్ కార్లను ఎందుకు క్రాష్ టెస్ట్ చేయరనడానికి అనేక కారణాలు ఉన్నాయి. రోల్స్ రాయిస్ కార్లు కస్టమర్ యొక్క ఎంపిక ప్రకారం తయారుచేస్తారు. ఆ సంస్థ తయారుచేసే ప్రతి కారు ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ప్రతి కారు క్రాష్ టెస్ట్ చేయాలంటే కంపెనీ ఒకే రకమైన మోడల్ కార్లను ఎక్కువుగా తయారుచేయాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు ఎక్కువ. రోల్స్ రాయిస్ కార్ల ఉత్పత్తి చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. ఏడాదికి ఆ కార్ల తయారీ పదుల సంఖ్యలోనే ఉంటుంది. ఇతర కార్ల కంపెనీలతో పోలిస్తే వాటి ఉత్పత్తి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల ప్రతి కారును క్రాష్ టెస్ట్ చేయడం సాధ్యం కాదు.
రోల్స్ రాయిస్ తన కార్ల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తోంది. ఆ కంపెనీ కార్లు వాడే వ్యక్తులు వీవీఐపీలు కావడంతో భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కంపెనీ తన కార్లలో అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌లను ఉపయోగిస్తుంది. ఆ మెటీరియల్ నాణ్యతను ముందుగానే తనిఖీ చేస్తారు. అందుకే ఈ కార్లకు క్రాష్ టెస్ట్‌లు చేయరు. రోల్స్ రాయిస్ ఒక లగ్జరీ బ్రాండ్ కంపెనీ తన కార్లను అత్యంత సురక్షితమైనదిగా ఆ కంపెనీ అభివర్ణించింది. ఏదైనా కారు క్రాష్ టెస్ట్ నిర్వహించడానికి కనీసం నాలుగు కార్లు అవసరం. కారు యొక్క నాణ్యత తనిఖీ చేయడానికి, ఒక కారు ముందు, వెనుక వైపుల నుండి బలంగా వేరే కారుతో ఢీకొంటారు. అప్పుడు మాత్రమే కారు భద్రతా రేటింగ్ పొందుతుంది. కానీ రోల్స్ రాయిస్ కారు ధర కోట్లలో ఉంటుంది. రోల్స్ రాయిస్ కారు యొక్క క్రాష్ టెస్ట్ కోసం ఒకే రకమైన నాలుగు కార్లు తయారుచేయాల్సి ఉంటుంది. అలా చేయడం సాధ్యం కాకపోవడంతో రోల్స్ రాయిస్ కార్లు క్రాష్ టెస్ట్ చేయరు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here