Share News

భారత మార్కెట్లోకి రోల్స్‌ రాయిస్‌ కలినాన్‌ సిరీస్‌-2

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:29 AM

అలా్ట్ర లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్‌ రాయిస్‌.. భారత మార్కెట్లోకి కలినాన్‌ సిరీస్‌-2 కార్లను తీసుకువచ్చింది. రెండు కొత్త వేరియంట్లలో కలినాన్‌ సిరీస్‌ 2, బ్లాక్‌ బ్యాడ్జ్‌ కలినాన్‌ సిరీస్‌ 2 పేరుతో వీటిని

భారత మార్కెట్లోకి రోల్స్‌ రాయిస్‌ కలినాన్‌ సిరీస్‌-2

ప్రారంభ ధర రూ.10.50 కోట్లు

న్యూఢిల్లీ: అలా్ట్ర లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్‌ రాయిస్‌.. భారత మార్కెట్లోకి కలినాన్‌ సిరీస్‌-2 కార్లను తీసుకువచ్చింది. రెండు కొత్త వేరియంట్లలో కలినాన్‌ సిరీస్‌ 2, బ్లాక్‌ బ్యాడ్జ్‌ కలినాన్‌ సిరీస్‌ 2 పేరుతో వీటిని విడుదల చేసింది. ఈ కార్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.10.50 కోట్లు, రూ.12.25 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. 6.75 లీటర్‌ వీ12 ఇంజన్‌తో కూడిన ఈ సూపర్‌ లగ్జరీ ఎస్‌యూవీ కార్ల డెలివరీలు ఈ ఏడాది చివరి (క్యూ4)లో ప్రారంభించనున్నట్లు రోల్స్‌ రాయిస్‌ వెల్లడించింది. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో రోల్స్‌ రాయి్‌సకు భారత్‌ ఎంతో కీలకమైన మార్కెట్‌ ఉందని, దీంతో ఈ మోడల్స్‌ను ఇక్కడ విడుదల చేసినట్లు రోల్స్‌ రాయిస్‌ మోటార్‌ కార్స్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ఇరేన్‌ నిక్కిన్‌ తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ కార్లను కొనుగోలు చేసిన వారిలో 90 శాతం మంది సొంతంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళుతుండగా కేవలం పది శాతం మంది మాత్రమే డ్రైవర్‌ సేవలు పొందుతున్నారని ఇరేన్‌ చెప్పారు. కాగా 2010లో తమ కార్లను కొనుగోలు చేసే వారి సగటు వయసు 56 ఏళ్లుగా ఉండగా ప్రస్తుతం ఇది 43 సంవత్సరాలకు తగ్గిందని తెలిపారు.

Updated Date - Sep 28 , 2024 | 05:29 AM