Share News

రూ.5 లక్షల కోట్లు గల్లంతు

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:44 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 1,064.12 పాయింట్లు (1.30 శాతం) పతనమై 80,684.45 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 332.25 పాయింట్లు (1.35 శాతం) క్షీణించి 24,336 వద్దకు జారుకుంది...

రూ.5 లక్షల కోట్లు గల్లంతు

స్టాక్‌ మార్కెట్లో భారీ నష్టాలు

  • సెన్సెక్స్‌ 1,064 పాయింట్లు డౌన్‌

  • 81,000 దిగువ స్థాయికి సూచీ

  • 24,300 వద్దకు పడిపోయిన నిఫ్టీ

  • ఫెడ్‌ రిజర్వ్‌ సమీక్ష నేపథ్యంలో

మార్కెట్లో పోటెత్తిన అమ్మకాలు

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 1,064.12 పాయింట్లు (1.30 శాతం) పతనమై 80,684.45 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 332.25 పాయింట్లు (1.35 శాతం) క్షీణించి 24,336 వద్దకు జారుకుంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ), బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ (బీఓజే) ఈవారంంలో ప్రామాణిక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు అమ్మకాలను పోటెత్తించారు. వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడం, రూపాయి క్షీణతతోపాటు మన మార్కెట్‌ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మళ్లీ తరలిపోతుండటం ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత కుంగదీసింది. అమ్మకాల హోరులో మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.4.92 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.455.14 లక్షల కోట్లకు (5.36 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీలూ నష్టపోయాయి. బీఎ్‌సఈలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ప్రాతినిథ్య సూచీలైన మిడ్‌క్యాప్‌ 0.65 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.52 శాతం నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. టెలికాం అత్యధికంగా 2.18 శాతం పతనమవగా.. మెటల్‌, ఆటో, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కమోడిటీస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లు 1.77 శాతం వరకు క్షీణించాయి. బీఎ్‌సఈలో 2,502 కంపెనీల స్టాక్స్‌ నష్టపోగా.. 1,521 లాభపడ్డాయి. 84 యథాతథంగా ముగిశాయి. 28 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకున్నాయి.


ఐపీఓ సమాచారం

  • వెంటివ్‌ హాస్పిటాలిటీ రూ.1,600 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ), కరారో ఇండియా లిమిటెడ్‌ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనున్నాయి. వెంటివ్‌ హాస్పిటాలిటీ ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.610-643గా నిర్ణయించింది. కరారో ఇండియా ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ రూ.668-704గా ఉంది.

  • ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ఆయ్‌ ఫైనాన్స్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,450 కోట్లు సమీకరించనుంది.

  • ఆరాధ్య డిస్పోజల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు వచ్చేందుకు ఎన్‌ఎ్‌సఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ‘ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌’కు డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 36.96 లక్షల షేర్లను విక్రయించనుంది.

Updated Date - Dec 18 , 2024 | 01:45 AM