మరో చారిత్రక కనిష్ఠానికి రూపాయి
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:51 AM
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 13 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ఠ స్థాయి 84.60కి దిగజారింది.
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 13 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ఠ స్థాయి 84.60కి దిగజారింది. మార్కెట్ నుంచి విదేశీ నిధులు నిరాటంకంగా తరలిపోతుండడంతో పాటు దిగుమతిదారుల నుంచి నెలాఖరు డిమాండు, శుక్ర వారం వెలువడిన నిరుత్సాహపూరిత జీడీపీ గణాం కాలు కరెన్సీ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీన పరిచాయి.