Share News

హిందుస్థాన్‌ జింక్‌లో 2.5% వాటా విక్రయం

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:15 AM

వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌)లో 2.5 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది...

హిందుస్థాన్‌ జింక్‌లో 2.5% వాటా విక్రయం

  • షేరు కనీస ధర రూ.505

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌)లో 2.5 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా షేరు కనీస ధరను రూ.505గా నిర్ణయించింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ముగింపు ధర రూ.559.45తో పోలిస్తే, ఓఎ్‌ఫఎ్‌సలో షేరు 9.7 శాతం తక్కువకు లభించనుంది. కంపెనీలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.5,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రెండు రోజులపాటు సాగనున్న ఈ ఓఎ్‌ఫఎ్‌సలో బుధవారం నాన్‌-రిటైల్‌ ఇన్వెస్టర్లు, గురువారం రిటైల్‌ ఇన్వెస్టర్లు కంపెనీ షేర్ల కొనుగోలుకు బిడ్‌ వేయవచ్చు. హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంత 63.24 శాతం, కేంద్రం 29.54 శాతం, ఎల్‌ఐసీ 2.76 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Updated Date - Nov 06 , 2024 | 01:15 AM