ఫార్చూన్ 100 శక్తివంతుల్లో నంబర్ 3 సత్య నాదెళ్ల
ABN , Publish Date - Nov 14 , 2024 | 03:31 AM
ప్రపంచ కుబేరుల్లోనే కాదు, అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపావేత్తల జాబితాలోనూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్ర స్థానం సంపాదించారు. ‘అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపారవేత్తలు’ పేరుతో...
ముకేశ్ అంబానీ, పిచాయ్‌కూ చోటు
టాప్‌లో ఎలాన్ మస్క్
న్యూయార్క్: ప్రపంచ కుబేరుల్లోనే కాదు, అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపావేత్తల జాబితాలోనూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్ర స్థానం సంపాదించారు. ‘అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపారవేత్తలు’ పేరుతో ఫార్చూన్ పత్రిక ఒక జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉంటే, ఎన్‌విడియా సీఈఓ జెన్‌సెన్ హాంగ్ రెండో స్థానంలో, మైక్రోసాఫ్ట్ సీఈతో సత్య నాదెళ్ల మూడో స్థానంలో నిలిచారు. సత్య నాదెళ్ల, జెన్‌సెన్ హాంగ్ టెక్నాలజీ, కృత్రిమ మేధతో వ్యాపారాల స్వరూప స్వభావాలనే మార్చివేస్తున్నారని ఫార్చూన్ పత్రిక కితాబిచ్చింది. ఫైనాన్స్, కన్స్యూమర్ టెక్నాలజీలను కొత్త పుంతలు తొక్కిస్తున్న వారెన్ బఫెట్, జెమీ డైమన్, యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కీ ఈ జాబితాలో స్థానం దొరికింది.
అంబానీకి 12వ స్థానం : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 10వ స్థానం, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 11వ స్థానం సంపాదించారు.