Share News

ప్రభుత్వానికి ఎస్‌బీఐ రూ.6,959 కోట్ల డివిడెండ్‌

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:06 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది.

ప్రభుత్వానికి ఎస్‌బీఐ రూ.6,959 కోట్ల డివిడెండ్‌

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. శుక్రవారం నాడిక్కడ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా ఈ డివిడెండ్‌ చెక్‌ను అందజేశారు. గడచిన ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్‌బీఐ ఒక్కో షేరుకు రూ.13.70 డివిడెండ్‌ను ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.11.30గా ఉంది. కాగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) కూడా కేంద్ర ప్రభుత్వానికి రూ.857 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. బ్యాంక్‌ ఎండీ నిధు సక్సేనా ఈ మేరకు ఆర్థిక మంత్రికి డివిడెండ్‌ చెక్‌ను అందించారు.

Updated Date - Jun 22 , 2024 | 04:06 AM