21,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్స్
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:14 AM
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్.. 2024 సంవత్సరానికి గాను బాలికల కోసం మలబార్ నేషనల్ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం కింద బాలికల విద్యకు...
మలబార్ గ్రూప్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్.. 2024 సంవత్సరానికి గాను బాలికల కోసం మలబార్ నేషనల్ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం కింద బాలికల విద్యకు తోడ్పాటునుందించనున్నట్లు మలబార్ గ్రూప్ వెల్లడించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ సమక్షంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్య కోసం మలబార్ గ్రూప్ స్కాలర్‌షి్‌ప్సను అందించనుంది. ఇందుకోసం మలబార్ గ్రూప్ రూ.16 కోట్లను కేటాయించింది.
ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ ఎండీ (ఇండియా ఆపరేషన్స్) ఆషెర్ ఓ, వైస్ చైర్మన్ అబ్దుల్ సలామ్ కేపీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఏకే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 95,000 మందికి పైగా బాలికలకు స్కాలర్‌షి్‌ప్సను మలబార్ గ్రూప్ అందించింది. ఇందుకోసం రూ.60 కోట్లు వెచ్చించింది.