SEBI: యూట్యూబర్‌కు షాకిచ్చిన సెబీ.. రూ.9.5 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు!
ABN , Publish Date - Dec 19 , 2024 | 10:38 PM
స్టాక్‌మార్కెట్ వ్యాపారానికి సలహాలిస్తామంటూ అనుమతి లేని వ్యాపారానికి తెరతీసిన యూట్యూబర్ రవీంద్ర బాలు భారతిపై సెబీ కొరడా ఝళపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా దండుకున్న రూ.9.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టాక్‌మార్కెట్ వ్యాపారానికి సలహాలిస్తామంటూ అనుమతి లేని వ్యాపారానికి తెరతీసిన యూట్యూబర్ రవీంద్ర బాలు భారతిపై సెబీ కొరడా ఝళపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా దండుకున్న రూ.9.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఏప్రిల్ 4 వరకూ వారు ఎటువంటి స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం కూడా విధించింది (Business).
Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్ల లక్షల కోట్లు ఆవిరి..
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులపై సలహాలు ఇచ్చేందుకు బాలు భారతి అనుమతుల తీసుకోకుండానే రవీంద్రభారతి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పాడు. ట్రేడింగ్‌పై రికమెండేషన్లు, సలహాలు ఇచ్చేందుకు యూట్యూబ్‌లో తనకు ఫాలోయింగ్‌ను ఆసరా చేసుకుని తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు. ట్రేడింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకుండా తన క్లైంట్లకు రకరకా ఉత్పత్తులను అంటగట్టారు. వారి నిర్ణయాలు తీసుకోకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ అన్నీ సంస్థే చక్కబెట్టేది. దర్యాప్తులో బయటపడ్డ ఈ నివేదిక ఆధారంగా సెబీ బాలూ భారతి, అతడి కంపెనీలు కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.9.49 బయటకు కక్కాలని ఆదేశించింది. అదనంగా ఆరు శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లకు భారీ ఎడ్యుకేషన్ పేరిట సలహాలు ఇవ్వడం లేదా అడ్వైజర్లుగా పనిచేయడం కట్టిపెట్టాలని స్పస్టం చేసింది.
ఎస్‌బీఐ ఎండీగా తెలుగు బిడ్డ రామమోహన రావు
కాగా, రవీంద్ర భారతి.. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ను 2016లో తన భార్య సుభాంగీ భారతితో కలిసి స్థాపించారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి విద్యా సంబంధిత కార్యక్రమాలు సాగిస్తామని కంపెనీ ప్రచారం చేసుకునేది. భారతీ షేర్ మార్కెట్ పేరిట ఓ వెబ్‌సైట్ కూడా నిర్వహించేది. కాగా, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ సలహాలు ఇస్తామంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అనేక మంది పుట్టుకురావడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. అనుమతులు లేనిదే ఇలా ఆర్థికసలహాలు ఇవ్వొద్దంటూ వారిపై నిషేధం కూడా విధించింది.
Read More Business News and Latest Telugu News