Share News

ఎంఎ్‌ఫలకు సెబీ మరో వెసులుబాటు

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:05 AM

దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరో వెసులుబాటు కల్పించింది. ఈ ఫండ్స్‌ పెట్టుబడులను నిర్వహించే ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్లు...

ఎంఎ్‌ఫలకు సెబీ మరో వెసులుబాటు

విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఓకే

న్యూఢిల్లీ: దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరో వెసులుబాటు కల్పించింది. ఈ ఫండ్స్‌ పెట్టుబడులను నిర్వహించే ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్లు, తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని విదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా యూనిట్‌ ట్రస్టుల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించింది. అయితే ఆ విదేశీ ఫండ్‌ లేదా యూనిట్‌ ట్రస్టు నికర పెట్టుబడుల్లో 25 శాతానికి మించి మన దేశ కంపెనీలకు చెందిన షేర్లు లేదా రుణ పత్రాలు ఉండకూడదని స్పష్టం చేసింది. దీంతో ఎంఎఫ్‌ పథకాల ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్లకు పెట్టుబడుల వివిధీకరణకు మరింత వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఒకవేళ ఈ పథకాల పెట్టుబడుల్లో భారత కంపెనీల షేర్లు, రుణ పత్రాల వాటా 25 శాతం మించితే, ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆరు నెలల వరకు లేదా మళ్లీ పెట్టుబడులు 25 శాతం దిగువకు వచ్చే వరకు, దేశీయ ఎంఎ్‌ఫలు ఆ పథకాల్లో పెట్టుబడులు పెట్టకూడదని సెబీ నిషేధించింది.

Updated Date - Nov 05 , 2024 | 04:05 AM