పేటీఎం చీఫ్‌కు సెబీ నోటీసులు
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:54 AM
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు సెబీ నోటీసులు జారీ చేసింది. కంపెనీ ప్రమోటరై ఉండి, ఇతర ఉద్యోగుల్లా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈ-సాప్స్) కింద...
న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు సెబీ నోటీసులు జారీ చేసింది. కంపెనీ ప్రమోటరై ఉండి, ఇతర ఉద్యోగుల్లా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈ-సాప్స్) కింద శర్మ 2.1 కోట్ల షేర్లను కేటాయించుకోవడంపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఇది పాత విషయమేనని, దీనికి సంబంధించి రెగ్యులేటరీ సంస్థలు అన్నిటితో తాము చర్చలు జరుపుతున్నట్టు పేటీఎం తెలిపింది. ఈ వార్తలతో బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. ఒక దశలో 8.8 శాతం వరకు నష్టపోయి రూ.505.25 స్థాయిని తాకాయి. చివరికి 4.41 శాతం నష్టంతో రూ.530.05 వద్ద ముగిశాయి.