Share News

అదానీలకు సెబీ షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:25 AM

గౌతమ్‌ అదానీ, ఆయన సోదరులు రాజేశ్‌, వసంత్‌ అదానీలకు సెబీ ఈ మధ్యనే షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం ఈ విషయాన్ని...

అదానీలకు సెబీ షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: గౌతమ్‌ అదానీ, ఆయన సోదరులు రాజేశ్‌, వసంత్‌ అదానీలకు సెబీ ఈ మధ్యనే షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల మీడియా కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, ప్రణవ్‌ అదానీ, ప్రణవ్‌ వోరా ఇంకా అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న ధర్మేశ్‌ పరేఖ్‌, ఓపల్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గల్ఫ్‌ ఏషియా ట్రేడ్‌, ఎమర్జింగ్‌ ఇండియా ఫోకస్‌ ఫండ్‌, బెర్ముడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫండ్‌ గ్లోబల్‌ మాక్రో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా సెబీ నుంచి నోటీసులు అందుకున్నట్లు కథనం పేర్కొంది. మొత్తంగా అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న 32 సంస్థలు, 4 లిస్టెడ్‌ కంపెనీలకు సెక్యూరిటీల చట్టంలోని సెక్షన్‌ 11, 11బీ ప్రకారంగా సెబీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

Updated Date - Oct 31 , 2024 | 01:25 AM