Share News

రిలయన్స్‌ బిగ్‌ ఆస్తుల జప్తు : సెబీ

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:30 AM

అనిల్‌ అంబానీ నేతృత్వలోని రిలయన్స్‌ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ మరోసారి షాకిచ్చింది. ఈ సంస్థకు చెందిన బ్యాంకు, డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు జప్తు చేయాలని...

రిలయన్స్‌ బిగ్‌ ఆస్తుల జప్తు : సెబీ

న్యూఢిల్లీ : అనిల్‌ అంబానీ నేతృత్వలోని రిలయన్స్‌ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ మరోసారి షాకిచ్చింది. ఈ సంస్థకు చెందిన బ్యాంకు, డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు జప్తు చేయాలని ఆదేశించింది. గత నెల 14న విధించిన రూ.26 కోట్ల జరిమానాను కంపెనీ నిర్ణీత 15 రోజుల్లో చెల్లించకపోవడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ నిధుల దారి మళ్లింపులో రిలయన్స్‌ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పాత్ర ఉండడంతో సెబీ ఈ చర్య తీసుకుంది. దీనికి సంబంధించి సెబీ ఇప్పటికే కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ అనిల్‌ అంబానీపైనా రూ.25 కోట్ల జరిమానా, ఐదేళ్ల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి బహిష్కరించింది.

Updated Date - Dec 03 , 2024 | 05:30 AM