వచ్చే జూన్ నాటికి 82,000కు సెన్సెక్స్!
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:39 AM
భారత స్టాక్ మార్కెట్లో అత్యంత సుదీర్ఘ, బలమైన బుల్ ర్యాలీ కొనసాగుతోందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. 2025 జూన్ నాటికి సెన్సెక్స్ 82,000 మైలురాయికి...
భారత స్టాక్ మార్కెట్లో అత్యంత సుదీర్ఘ, బలమైన బుల్ ర్యాలీ కొనసాగుతోందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. 2025 జూన్ నాటికి సెన్సెక్స్ 82,000 మైలురాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. భారత స్థూల ఆర్థికాంశాలు అత్యంత సానుకూలంగా ఉన్న నేపథ్యంలో చాలా కంపెనీల షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయంది. బీజేపీ నేతృత్వ ఎన్‌డీఏ మెజారిటీ దక్కించుకోవడంతో పాటు మూడోసారి అధికారంలోకి రానుండటం విధానపరమైన స్థిరత్వానికి భరోసా కల్పించనుందని, ఇది ఈక్విటీ మార్కెట్లకు సానుకులంగా పరిణమించనుందని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలకు బాట లు వేయనున్నాయని, వచ్చే ఐదేళ్ల పాటు 20 శాతం చొప్పున ఆదాయ వృద్ధి నమోదు కావచ్చన్న మా అంచనాలకు మద్దతివ్వనున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.