100 రోజుల్లో సెన్సెక్స్ 6,300 పాయింట్లు అప్ 100 రోజుల్లో సెన్సెక్స్ 6,300 పాయింట్లు అప్
ABN , Publish Date - Sep 18 , 2024 | 01:16 AM
ప్రధాని నరేంద్ర మోదీ మూడో విడత పాలనలో మొదటి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల్లో సెన్సెక్స్ 6,300 పాయింట్లు (8.20 శాతం) పెరగగా.. నిఫ్టీ 2,000 పాయింట్లకు పైగా (9.28 శాతం) పుంజుకుంది...
రూ.45 లక్షల కోట్లు పెరిగిన స్టాక్ మార్కెట్ సంపద
ప్రధాని నరేంద్ర మోదీ మూడో విడత పాలనలో మొదటి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల్లో సెన్సెక్స్ 6,300 పాయింట్లు (8.20 శాతం) పెరగగా.. నిఫ్టీ 2,000 పాయింట్లకు పైగా (9.28 శాతం) పుంజుకుంది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు 18 శాతం ఎగబాకగా.. ఐటీ, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 22 శాతం చొప్పున వృద్ధి చెంది టాప్ పెర్‌ఫార్మింగ్ సెక్టార్లుగా నిలిచాయి. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లభించకపోవడం, బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంపు, సెబీ చీఫ్ పై పలు ఆరోపణలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ మెరుగైన పనితీరు కనబర్చడం గమనార్హం.