Share News

రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు పడేశాయ్‌..

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:54 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లలో అమ్మకాలకు...

రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు పడేశాయ్‌..

వరుసగా రెండో రోజూ నష్టాల్లో సూచీలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. దీంతో గురువారం సెన్సెక్స్‌ 151.48 పాయింట్లు కోల్పోయి 82,201.16 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53.60 పాయింట్ల నష్టంతో 25,145.10 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 19 నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.41 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం 0.56 శాతం వరకు పెరిగాయి. రంగాలవారీ సూచీల్లో రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.95 శాతం వరకు నష్టపోయాయి.


ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 83.97 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 0.96 శాతం పెరుగుదలతో 73.40 డాలర్ల వద్ద ట్రేడైంది.

Updated Date - Sep 06 , 2024 | 12:54 AM