Share News

Ratan Tata: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు.. పడిపోయిన 'టాటా' షేర్లు

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:41 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. తన ఆరోగ్యంపై టాటా క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Ratan Tata: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు.. పడిపోయిన 'టాటా' షేర్లు

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. తన ఆరోగ్యంపై టాటా క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్తో సహా పలు టాటా కంపెనీల షేర్లు క్షీణించాయి. తేజాస్ నెట్వర్క్స్, ఆర్ట్సన్ ఇంజినీరింగ్ వరుసగా అత్యధికంగా 5.1 శాతం, 5 శాతం మేర నష్టపోయాయి. రతన్ టాటా స్పష్టత ఇచ్చినప్పటికీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్‌తో సహా పలు టాటా కంపెనీల స్టాక్‌లు క్షీణించాయి.

అయితే, టాటా కాఫీ, టాటా మెటాలిక్స్, టీసీఎస్ వంటి కొన్ని కంపెనీలు లాభపడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సెప్టెంబర్‌లో 33 శాతం వార్షిక (YoY) అమ్మకాల వృద్ధిని నమోదు చేయడంతో టాటా మోటార్స్ కూడా దృష్టి సారించింది. సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ షేరు స్వల్పంగా తగ్గి, 0.086 శాతం క్షీణించి రూ. 929.95 వద్ద ట్రేడవుతోంది.


అసలేమైందంటే..

రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ఇవాళ రూమర్లు గుప్పుమన్నాయి. ICUలో నిపుణుల బృందం ఆయన పరిస్థితిని నిరంతరం చెక్ చేస్తోందని ఆ వార్తల సారాంశం. వీటిప రతన్ టాటా స్వయంగా స్పందించారు. తాను బాగానే ఉన్నానని, రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. తనను ఐసీయూలో చేర్చారనే వార్తలను కొట్టిపారేశారు. మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు. రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు.


ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా మునిమనవడు. 1990 నుంచి 2012 వరకు గ్రూప్ ఛైర్మన్‌గా, అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూపు ఛారిటబుల్ ట్రస్టులకు రతన్ అధిపతిగా కొనసాగుతున్నారు. 1962లో టాటా గ్రూప్‌లో చేరినప్పుడే టాటా అసలు కథ మొదలైంది. 1990లో గ్రూప్ ఛైర్మన్ కాకముందు వివిధ పదవులు నిర్వహించి క్రమంగా వ్యాపార మెట్లు ఎక్కారు. ఆయన పదవీ కాలంలో టాటా గ్రూప్ దేశీయంగా, విదేశాలలో గణనీయమైన వృద్ధిని, విస్తరణను సాధించింది. టాటా దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలు కంపెనీని టెలికాం, రిటైల్, ఆటో వంటి కొత్త పరిశ్రమలలోకి విస్తరించే స్థాయికి చేరాయి.

ఇవి కూడా చదవండి...

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 04:43 PM