Share News

శ్రేయాస్‌కు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:25 AM

వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరిగే ‘మహా కుంభ మేళా-2025’ ప్రకటనల హక్కులు హైదరాబాద్‌ కంపెనీ చేజిక్కించుకుంది. ఆద్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌నకు...

శ్రేయాస్‌కు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు

హైదరాబాద్‌: వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరిగే ‘మహా కుంభ మేళా-2025’ ప్రకటనల హక్కులు హైదరాబాద్‌ కంపెనీ చేజిక్కించుకుంది. ఆద్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌నకు చెందిన శ్రేయాస్‌ మీడియా సంస్థ ఈ హక్కులు దక్కించుకుంది. ప్రకనలతో పాటు వెండింగ్‌ జోన్లు, అమ్యూజ్‌మెంట్‌ జోన్‌, ఫుడ్‌ కోర్టుల ఏర్పాటు హక్కులు కూడా తమకే దక్కినట్టు తెలిపింది. దాదాపు 4,000 హెక్టార్ల ప్రాంతంలో జరిగే ఈ మహా కుంభ మేళాకు 50 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ మేళాలో తమ వస్తు, సేవల ప్రచార ప్రకటనల కోసం కార్పొరేట్‌ రంగం రూ.3,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని అంచనా.

Updated Date - Dec 24 , 2024 | 06:11 AM