శ్రీరామ్ మల్టీ సెక్టార్ రొటేషన్ ఫండ్
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:37 AM
శ్రీరామ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్.. శ్రీరామ్ మల్టీ సెక్టార్ రొటేషన్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్‌ను తీసుకువచ్చింది. దేశంలో ఈ తరహా ఫండ్‌ను తీసుకురావటం ఇదే మొదటిసారి. మంచి లాభాల్లో సాగుతున్న...
శ్రీరామ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్.. శ్రీరామ్ మల్టీ సెక్టార్ రొటేషన్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్‌ను తీసుకువచ్చింది. దేశంలో ఈ తరహా ఫండ్‌ను తీసుకురావటం ఇదే మొదటిసారి. మంచి లాభాల్లో సాగుతున్న రంగాలను గుర్తించి ఎప్పటికప్పుడు పెట్టుబడుల పోర్టుఫోలియోలను మార్చుకుంటూ మధ్య, దీర్ఘకాలంలో మెరుగైన రిటర్నులు అందించే విధంగా ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌ను రూపొందించినట్లు శ్రీరామ్ ఏఎంసీ వెల్లడించింది. వివిధ రంగాల మూమెంటమ్ ఆధారంగా ట్రెండింగ్‌లో ఉన్న మూడు నుంచి ఆరు రంగాల్లో ఈ ఫండ్ ప్రధానంగా పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడులు పెట్టే రంగాలను శ్రీరామ్ ఏఎంసీకి చెందిన ఎన్‌హాన్స్‌డ్ క్వాంటమెంటల్ ఇన్వె్‌స్టమెంట్ (ఈక్యూఐ) ఫ్రేమ్‌వర్క్ ఎంపిక చేస్తుంది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. క్రమానుగత పెట్టుబడి (సిప్) రూపంలో కూడా ఇంతే మొత్తం పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ఫండ్ ముగింపు తేదీ డిసెంబరు 2.