స్కోడా కైలాక్ బుకింగ్స్ షురూ
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:38 AM
చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా తన తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైలాక్ బుకింగ్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించింది...
ప్రారంభ ధర రూ.7.89 లక్షలు
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా తన తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైలాక్ బుకింగ్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించింది. కారు డెలివరీ వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఏడు రంగులు, ఏడు వేరియంట్లలో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.7.89 లక్షలు కాగా.. గరిష్ఠ రేటు రూ.14.4 లక్షలుగా ఉంది. మారుతి బ్రెజ్జా, హ్యుండయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, టాటా నెగ్జాన్, కియా సోనెట్‌కు పోటీగా స్కోడా ఈ కారును అందుబాటులోకి తెస్తోంది.