Share News

Banking: వచ్చే ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి.. ఎలాంటి సేవలు అందిస్తారంటే..?

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:36 AM

ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే బ్యాంకులు పని చేయవు. అదీ మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం వచ్చింది. అయితే బ్యాంకులు సెలవు అని అందరూ అనుకోవచ్చు. కాని ఈ మార్చి 31 ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Banking: వచ్చే ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి.. ఎలాంటి సేవలు అందిస్తారంటే..?

ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే బ్యాంకులు పని చేయవు. అదీ మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం వచ్చింది. అయితే బ్యాంకులు సెలవు అని అందరూ అనుకోవచ్చు. కాని ఈ మార్చి 31 ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగానికి సంబంధించి మొత్తం 33 బ్యాంకులు వచ్చే ఆదివారం పని చేస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. అయితే ఆరోజు ఎలాంటి లావాదేవీలు జరపవచ్చనే దానిపై రిజర్వు బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరమైన అన్ని లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు, ఆర్బీఐ కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలు,అలాగే ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌క్షన్లు చేసుకోవచ్చని తెలిపింది.

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్లు హాంఫట్‌

ఈ సేవలు పొందొచ్చు..

NEFT, RTGS: మార్చి 31న ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (RTGS) విధానం ద్వారా అర్థరాత్రి 12 గంటల వరకు లావాదేవీలు జరపవచ్చని ఆర్బీఐ తెలిపింది.

చెక్ క్లియరెన్స్‌: ప్రభుత్వ అకౌంట్లకు సంబంధించి ఏవైనా చెక్కులను క్లియరింగ్ కోసం బ్యాంకులో సమర్పించవచ్చని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ చెల్లింపులు, ప్రత్యేక డిపాజిట్ పథకం 1975, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 1968, కిసాన్ వికాస్ పత్ర 2014, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004కు సంబంధించిన సేవలు ఈ ఆదివారం లభిస్తాయని రిజర్వు బ్యాంకు తెలిపింది.

మార్చి 31న పనిచేసే బ్యాంకులు..

ప్రభుత్వ రంగ బ్యాంకులు

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

4. కెనరా బ్యాంక్

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. ఇండియన్ బ్యాంక్

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

9. పంజాబ్ నేషనల్ బ్యాంక్

10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11. UCO బ్యాంక్

12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రైవేట్ బ్యాంకులు

13. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

14. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్

15. DCB బ్యాంక్ లిమిటెడ్

16. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్

17. HDFC బ్యాంక్ లిమిటెడ్

18. ICICI బ్యాంక్ లిమిటెడ్

19. IDBI బ్యాంక్ లిమిటెడ్

20. IDFC FIRST బ్యాంక్ లిమిటెడ్

21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్

22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్

23. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్

24. కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

25. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్

26. RBL బ్యాంక్ లిమిటెడ్

27. సౌత్ ఇండియన్ బ్యాంక్

28. యస్ బ్యాంక్ లిమిటెడ్

29. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్

30. బంధన్ బ్యాంక్ లిమిటెడ్

31. CSB బ్యాంక్ లిమిటెడ్

32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్

33. డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ భాగస్వామ్యం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

Updated Date - Mar 28 , 2024 | 10:36 AM