Share News

అంధుల కోసం ‘స్పెషల్‌ కేర్‌ గోల్డ్‌’ పాలసీ

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:58 AM

స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ‘స్పెషల్‌ కేర్‌ గోల్డ్‌’ పేరుతో అంధుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ తీసుకొచ్చింది. అంధులు సైతం పాలసీ వివరాలు చదువుకుని నిర్ణయాలు...

అంధుల కోసం ‘స్పెషల్‌ కేర్‌ గోల్డ్‌’ పాలసీ

స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ‘స్పెషల్‌ కేర్‌ గోల్డ్‌’ పేరుతో అంధుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ తీసుకొచ్చింది. అంధులు సైతం పాలసీ వివరాలు చదువుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ పాలసీ వివరాలను స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బ్రెయిలీ లిపిలో అందిస్తోంది. ఒక బీమా కంపెనీ అంధుల కోసం బ్రెయిలీ లిపిలో బీమా పాలసీ తీసుకు రావడం దేశంలో ఇదే మొదటిసారి. నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ అంధత్వం ఉన్న వ్యక్తులు ఈ సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. దేశంలో ఉన్న దాదాపు మూడున్నర కోట్ల మంది అంధుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీ రూపొందించినట్టు స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది,

Updated Date - Sep 05 , 2024 | 02:58 AM