Share News

‘ఆటో’ జోరుకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:57 AM

దేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ జోరుకి బ్రేక్‌ పడింది. కొనుగోలుదారులు లేక డీలర్ల వద్ద పేరుకుపోయిన నిల్వలు తగ్గించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్‌ కంపెనీలు సరఫరాను తగ్గించాయి...

‘ఆటో’ జోరుకు బ్రేక్‌

న్యూఢిల్లీ: దేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ జోరుకి బ్రేక్‌ పడింది. కొనుగోలుదారులు లేక డీలర్ల వద్ద పేరుకుపోయిన నిల్వలు తగ్గించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్‌ కంపెనీలు సరఫరాను తగ్గించాయి. ఫలితంగా వివిధ కంపెనీల టోకు విక్రయాలు సెప్టెంబరులో గణనీయంగా క్షీణించాయి. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే మారుతి సుజుకీ (4ు), హ్యుండయ్‌ (6ు), టాటా మోటార్స్‌ (8ు) విక్రయాలు తగ్గినట్టు ప్రకటించాయి. అయితే కియా (17ు), మహీంద్రా (24ు), టయోటా కిర్లోస్కర్‌ (14ు), జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ విక్రయాలు పెరిగాయి. కాగా ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్‌ ఆటో (23ు), హెచ్‌ఎంఎ్‌సఐ, హీరో మోటోకార్ప్‌ (19ు) విక్రయాలు పెరిగాయి.

Updated Date - Oct 02 , 2024 | 12:57 AM