Share News

ధరల అదుపుతోనే స్థిరమైన వృద్ధి

ABN , Publish Date - Nov 22 , 2024 | 05:33 AM

సుస్థిర ఆర్థిక వృద్ధి కావాలంటే ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. దీని వలన ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు, పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు...

ధరల అదుపుతోనే స్థిరమైన వృద్ధి

  • ఆర్‌బీఐ గవర్నర్‌

ముంబై: సుస్థిర ఆర్థిక వృద్ధి కావాలంటే ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. దీని వలన ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు, పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకర్లతో ముంబైలో జరిగిన ‘గ్లోబల్‌ సౌత్‌’ సదస్సులో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆరు శాతానికిపైగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తగ్గించడమే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) లక్ష్యమన్నారు. ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో సుస్థిర అభివృద్ధి, ఆర్థిక, ద్రవ్య స్థిరీకరణ వర్ధమాన దేశాలకు పెద్ద సవాల్‌గా మారిందని ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 05:33 AM