Share News

ఐటీ నియామకాల్లో స్తబ్దత!

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:38 AM

దేశీయంగా ఐటీ రంగ నియామకాల్లో స్తబ్దత మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కొవిడ్‌ ముప్పు తొలగిపోయిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు ఐటీ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ మనీషా సాబు అన్నారు.

ఐటీ నియామకాల్లో స్తబ్దత!

మరికొంత కాలం పాటు ఇదే పరిస్థితి

హైసియా ప్రెసిడెంట్‌ మనీషా సాబు

4న నేషనల్‌ సమ్మిట్‌, అవార్డుల కార్యక్రమం

సీపీ గుర్నానీకి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

హైదరాబాద్‌: దేశీయంగా ఐటీ రంగ నియామకాల్లో స్తబ్దత మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కొవిడ్‌ ముప్పు తొలగిపోయిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు ఐటీ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ మనీషా సాబు అన్నారు. శుక్రవారం నాడిక్కడ హైసియా 31వ ఎడిషన్‌ నేషనల్‌ సమ్మిట్‌, అవార్డ్స్‌ 2024 వివరాలను వెల్లడించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సహా ఇతరత్రా కారణాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడినపడక పోవటం ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించిందని అంతేకాకుండా ఇది ఉద్యోగ నియామకాలపై పడిందన్నారు. ఐటీ రంగంలో నియామకాలు సాధారణ స్థాయికి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు క్యాంపస్‌ నియామకాల్లో కూడా స్తబ్దత నెలకొందని తెలిపారు.

ఎస్‌టీపీఐ భాగస్వామ్యంతో: ‘ఏఐ: సెలబ్రేటింగ్‌ ఫ్యూచర్‌’ థీమ్‌తో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)- హైదరాబాద్‌తో కలిసి హైసియా ఈ నెల 14న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జాతీయ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని మనీషా సాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డీ. శ్రీధర్‌ బాబు ముఖ్య అతిఽథిగా హాజరు కానున్నారని తెలిపారు. అలాగే ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అర్వింద్‌ కుమార్‌, టెక్‌ మహీంద్రా మాజీ సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ, టీసీఎస్‌ ప్రెసిడెంట్‌ వీ రాజన్న కూడా ఈ సదస్సుల్లో పాల్గొంటారని తెలిపారు. ఐటీ రంగంలో సీపీ గుర్నానీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది హైసియా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు సాబు పేర్కొన్నారు. అలాగే ఐటీ పరిశ్రమలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీలకు అవార్డులు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.

హైబ్రిడ్‌ విధానానికి మొగ్గు: కొవిడ్‌ కాలంలో మొదలైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) విధానానికి కంపెనీలు నిదానంగా స్వస్తి పలుకుతున్నాయి. ప్రస్తుతం 15 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తుండగా 40 శాతం మంది హైబ్రిడ్‌ విధానంలో పని చేస్తున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీ్‌సకు వచ్చి పనిచేయాలని ఆదేశిస్తున్నాయని ఆమె చెప్పారు. రానున్న రోజుల్లో కంపెనీలు హైబ్రిడ్‌ విధానానికి మొగ్గు చూపే అవకాశం ఉందని సాబు పేర్కొన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 04:38 AM