Stock Market: వడ్డీరేట్లు యథాతథం.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..!
ABN , Publish Date - Apr 05 , 2024 | 04:25 PM
వరుసగా ఏడోసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ చివరకు 20 పాయింట్ల స్వల్ప లాభంతో రోజును ముగించింది.
వరుసగా ఏడోసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ప్రకటించింది. ఆ ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి (Stock Market). రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ చివరకు 20 పాయింట్ల స్వల్ప లాభంతో రోజును ముగించింది. నిఫ్టీ .95 పాయింట్ల స్వల్ప నష్టాల్లో రోజును ముగించింది. ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ భారీ లాభాలను ఆర్జించాయి (Business News).
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. ఒక దశలో 74, 361తో ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 20 పాయింట్ల లాభంతో 74,248 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 22, 513 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌లో ఇండియన్ ఆయిల్, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ లాంబార్డ్, గోద్రేజ్ ప్రోపర్టీస్ లాభాలను ఆర్జించాయి. బిర్లా సాఫ్ట్, దాల్మియా భారత్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శుక్రవారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడోసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులూ చేయలేదు.
ఇవి కూడా చదవండి..
Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?
Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే