Stock Market: తొలి రోజున దేశీయ సూచీల్లో బుల్ జోరు.. ఆల్ టైమ్ హైను తాకిన సెన్సెక్స్!
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:43 PM
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున దేశీయ సూచీలు లాభాల జోరు అందుకున్నాయి. మార్చిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఈ రోజు మాత్రం ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ జీవితకాల గరిష్టాలను అందుకుంది. చివరకు లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల కారణంగా సూచీలు లాభపడ్డాయి.
ఉదయం 73,968 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 74,254 వద్ద ఆల్ టైమ్ హైను టచ్ చేసింది. చివరకు 360 పాయింట్ల లాభంతో 74,014 వద్ద ముగిసింది. ఇక, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 22,462 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మంచి లాభాలు అందుకున్నాయి. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ షేర్ బాగా లాభపడ్డాయి. ఇక, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి.