స్ట్రింగ్ మెటావర్స్ ఆదాయం రూ.138 కోట్లు
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:08 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి గాను రూ.12.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి గాను రూ.12.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ రెవెన్యూ రూ.137.82 కోట్లుగా ఉంది. కంపెనీ ఈ మధ్యనే బీఎస్‌ఈలో లిస్ట్ అయ్యింది. దివాలా ప్రక్రియ (ఐబీసీ)లో భాగంగా సీఐఆర్‌పీ ముసాయిదా కింద ఉన్న బయో గ్రీన్ పేపర్స్ లిమిటెడ్‌తో స్ట్రింగ్ మెటావార్స్ ఇటీవల విలీనమైంది. ఈ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. వెబ్3 గేమింగ్, కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో కంపెనీ సాధించిన విజయాలకు ఈ ఫలితాలు నిదర్శనంగా ఉన్నాయని సంస్థ సీఈఓ సంతోష్ అల్తూరు తెలిపారు.