Share News

సంక్షోభంలో చక్కెర పరిశ్రమ ఎన్‌ఎ్‌ఫసీఎ్‌సఎఫ్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:11 AM

దేశీయ చక్కెర పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. చెరకు మద్దతు ధర పెంచినంతగా.. ప్రభుత్వం చక్కెర ధర పెంచకపోవడం పెద్ద సమస్యగా మారిందని చక్కెర పరిశ్రమ తెలిపింది.

సంక్షోభంలో చక్కెర పరిశ్రమ ఎన్‌ఎ్‌ఫసీఎ్‌సఎఫ్‌

న్యూఢిల్లీ: దేశీయ చక్కెర పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. చెరకు మద్దతు ధర పెంచినంతగా.. ప్రభుత్వం చక్కెర ధర పెంచకపోవడం పెద్ద సమస్యగా మారిందని చక్కెర పరిశ్రమ తెలిపింది. ప్రస్తుత చక్కెర సీజన్‌లో టన్ను చెరకు మద్దతు ధరను 8 శాతం పెంచి రూ.3,400గా నిర్ణయించిన ప్రభుత్వం, కిలో చక్కెరకు మిల్లులకు చెల్లించే కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ)ను 2018-19 నుంచి రూ.31 వద్దే కొనసాగించడాన్ని జాతీయ సహకార చక్కెర మిల్లుల సమాఖ్య (ఎన్‌ఎ్‌ఫసీఎ్‌సఎఫ్‌) తప్పుపట్టింది. ప్రస్తుతం కిలో చక్కెర ఉత్పత్తి ఖర్చులే రూ.41.66 చేరినట్టు తెలిపింది. దీనికి తోడు ఎగుమతులపై నిషేధంతో ఈ సీజన్‌ చివరికి దేశీయ వినియోగం పోనూ 115 లక్షల టన్నుల చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వమే పరిశ్రమను ఆదుకోవాలని కోరింది.

Updated Date - Nov 09 , 2024 | 06:11 AM