Share News

స్పైస్‌జెట్‌ చీఫ్‌కు ‘సుప్రీం’ చీవాట్లు

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:45 AM

స్సైస్‌జెట్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిస్‌కు నెలనెలా చెల్లించాల్సిన బకాయిలను...

స్పైస్‌జెట్‌ చీఫ్‌కు ‘సుప్రీం’ చీవాట్లు

న్యూఢిల్లీ: స్సైస్‌జెట్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిస్‌కు నెలనెలా చెల్లించాల్సిన బకాయిలను సక్రమంగా చెల్లించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్‌ను కొనేందుకు మీ వద్ద డబ్బులు ఉంటా యి గానీ, క్రెడిట్‌ సూయిస్‌ బకాయిలు చెల్లించేందుకు మాత్రం డబ్బులు లేవా?’ అని సూటిగా ప్రశ్నించింది. కుయుక్తులు పక్కన పెట్టి వచ్చే నెల 15 కల్లా క్రెడిట్‌ సూయిస్‌కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై మార్చి 22న జరిగే తదుపరి విచారణకు అజయ్‌ సింగ్‌ స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది.

Updated Date - Feb 20 , 2024 | 04:45 AM