Share News

వచ్చే బుధవారం స్విగ్గీ ఐపీఓ

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:53 AM

స్టాక్‌ మార్కెట్‌ ఇటీవల కాలంలో తీవ్ర ఆటుపోట్లు, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదిలో...

వచ్చే బుధవారం స్విగ్గీ ఐపీఓ

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ఇటీవల కాలంలో తీవ్ర ఆటుపోట్లు, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 127 పబ్లిక్‌ ఇష్యూలు జారీ కావడమే ఇందుకు తార్కాణం. వచ్చే వారంలోనూ అదే జోరు కొనసాగనుంది. సోమవారం ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో తమ షేర్లను లిస్టింగ్‌ చేయనుంది. కాగా ఫుడ్‌ డెలివరీ విభాగంలోని స్విగ్గీ, సెజిలిటీ ఇండియా, ఆక్మే సోలార్‌ పబ్లిక్‌ ఇష్యూలతో మార్కెట్‌ తలుపులు తట్టనున్నాయి. వీటితో పాటు గా ఎస్‌ఎంఈ విభాగంలో నీలం లినెన్స్‌ అండ్‌ గార్మెంట్స్‌ కంపెనీ వచ్చే శుక్రవారం పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయనుంది.


స్విగ్గీ: ఆన్‌లైన్‌లో ఆహార ఆర్డర్ల ఆధారంగా రెస్టారెంట్ల నుంచి కస్టమర్లకు రుచికరమైన ఆహారాన్ని వారింటికే చేరవేసే స్విగ్గీ రూ.11,327.43 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో రూ.1 ముఖవిలువ గల 17,50,87,863 ఈక్విటీ షేర్లతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 11,53,58,974 తాజా ఈక్విటీ షేర్లను ప్రైమరీ మార్కెట్లో విడుదల చేస్తోంది. ధరల శ్రేణి రూ.371-390 కాగా ఒక్కో లాట్‌లో 38 షేర్లుంటాయి. అంటే కనీస పెట్టుబడి రూ.14,820 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. వచ్చే సోమవారం నాటికి షేర్ల కేటాయింపు పూర్తి చేసి నవంబరు 13వ తేదీన బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో లిస్టింగ్‌ చేసే ఆస్కారం ఉంది.


సెజిలిటీ ఇండియా: పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) విధానంలో ఇష్యూకి వస్తున్న ఈ కంపెనీ రూ.2,106.60 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఒక్కోటి రూ.10 ముఖవిలువ గల 70,21,99,262 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇన్వెస్టర్లు కనీసం 500 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు బిడ్‌ చేయడానికి కనీస మొత్తం రూ.15,000. రూ.28-30 ధరల శ్రేణిలో ఒక్కో లాట్‌ 157 షేర్లుంటాయి. ఇష్యూ మంగళవారం ప్రారంభమై గురువారం ముగుస్తుంది. శుక్రవారం నాటికి షేర్ల కేటాయింపు పూర్తి చేస్తారు. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో ఈ షేర్లను 12వతేదీన లిస్టింగ్‌ చేస్తారు.


ఆక్మే సోలార్‌ హోల్డింగ్స్‌ : రూ.2,900 కోట్ల విలువ గల ఈ ఇష్యూ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. షేరు ధర శ్రేణిని రూ.275-289గా నిర్ణయించారు. ఒక్కో లాట్‌లో 51 షేర్లుంటాయి. అంటే కనీస పెట్టుబడి రూ.14,739. షేర్ల కేటాయింపు 11వ తేదీ నాటికి పూర్తి చేసి 13న బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈలలో లిస్టింగ్‌ చేయనున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 01:58 AM