భారత్‌తో ఎంఎఫ్‌ఎన్‌కు స్విట్జర్లాండ్ కటీఫ్
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:54 AM
భారత-స్విట్జర్లాండ్ వాణిజ్య బంధానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పన్నుల ఎగవేత నిరోదక ఒప్పందం (డీటీఏఏ)లో భాగంగా భారత్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రాధాన్యతా దేశం’
న్యూఢిల్లీ: భారత-స్విట్జర్లాండ్ వాణిజ్య బంధానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పన్నుల ఎగవేత నిరోదక ఒప్పందం (డీటీఏఏ)లో భాగంగా భారత్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రాధాన్యతా దేశం’ (ఎంఎ్‌ఫఎన్) హోదా క్లాజును వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రద్దు చేస్తున్నట్టు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. భారత్.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవల్‌పమెంట్ (ఓఈసీడీ) గ్రూప్‌లో చేరక ముందే ఏదైనా దేశంతో డీటీఏఏ ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన ఆ దేశానికి ఆటోమేటిగ్గా ఎంఎఫ్‌ఎన్ హోదా వచ్చినట్టు కాదని గత ఏడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ నిర్ణయంతో రెండు దేశాల కంపెనీలపై పన్నుల భారం పెరగడమేగాక, భారత్‌లో స్విట్జర్లాండ్ పెట్టుబడులపైనా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.