Share News

డేటాలీక్‌తో తస్మాత్‌ జాగ్రత

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:50 AM

పాలసీదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం కోసం ఐటీ వ్యవస్థల ఆడిటింగ్‌ చేపట్టాలని డేటాలీక్‌ జరిగినట్టు భావిస్తున్న రెండు బీమా కంపెనీలను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది...

డేటాలీక్‌తో తస్మాత్‌ జాగ్రత

రెండు బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ హెచ్చరిక

న్యూఢిల్లీ: పాలసీదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం కోసం ఐటీ వ్యవస్థల ఆడిటింగ్‌ చేపట్టాలని డేటాలీక్‌ జరిగినట్టు భావిస్తున్న రెండు బీమా కంపెనీలను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. ఐటీ వ్యవస్థల్లో లోపాలను కనుగొనేందుకు ఆయా కంపెనీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఆ బీమా కంపెనీలేవి అన్న విషయం ఐఆర్‌డీఏఐ ప్రకటించలేదు. డేటాలీక్‌ అనేది తీవ్రమైన అంశమని, పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కంపెనీలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇటీవలే తమ పాలసీదారుల డేటా లీక్‌ అయినట్టు స్టార్‌హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంగీకరించింది. రెండు కంపెనీలు తమ ఐటీ వ్యవస్థలను ఆడిట్‌ చేసేందుకు స్వతంత్ర ఆడిటర్లను నియమించుకోవాలని ఆదేశించినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది.

Updated Date - Oct 22 , 2024 | 12:50 AM