Share News

పన్ను రాయితీలు పెంచాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:22 AM

ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రిని..

పన్ను రాయితీలు పెంచాలి

ఫార్మా బడ్జెట్‌ కోరికల చిట్టా

న్యూఢిల్లీ: ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరాయి. ఇందుకోసం చేసే పెట్టుబడులకు 200 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే కంపెనీలు అభివృద్ధి చేసే కొత్త ఔషధాలకు పటిష్ఠమైన మేధో సంపత్తి హక్కుల రక్షణ (ఐపీఆర్‌) కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. కొత్త ఔషధాల అభివృద్ధిలో నష్ట భయం ఎక్కువగా ఉన్నందున ఈ రెండు చర్యలు తప్పనిసరని భారత ఔషధ ఉత్పత్తుల సంస్థ (ఓపీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ మతాయ్‌ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక వైద్య సేవల్లో ఉద్యోగులకు శిక్షణ సదుపాయలు కల్పించే సంస్థలకూ పన్ను రాయితీలు కల్పించాలని సూచించారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రాణ రక్షక ఔషధాలపై జీఎస్‌టీ, దిగుమతి సుంకాలు పూర్తిగా ఎత్తివేయాలని పరిశ్రమ వర్గాలు కోరాయి

Updated Date - Jul 08 , 2024 | 06:22 AM