టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు పెంపు!
ABN , Publish Date - Mar 20 , 2024 | 05:21 AM
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల జీతాలను ఏప్రిల్ నుంచి పెంచుతోంది. ఆన్‌సైట్ ఉద్యోగులకు సగటున రెండు నుంచి నాలుగు శాతం, ఆఫ్‌సైట్ ఉద్యోగులకు...
ఆఫ్‌సైట్ ఉద్యోగులకు మరింత హైక్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల జీతాలను ఏప్రిల్ నుంచి పెంచుతోంది. ఆన్‌సైట్ ఉద్యోగులకు సగటున రెండు నుంచి నాలుగు శాతం, ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం పెరుగుతాయని సమాచారం. మంచి పనితీరు కనబరిచే టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు మాత్రం 12 నుంచి 15 శాతం పెరగనున్నాయి. గత ఏడాది కూడా టీసీఎస్ ఉద్యోగుల జీతాలు 6 నుంచి 9 శాతం పెంచింది. మంచి పనితీరు కనబరిచే ఉద్యోగుల వేతనాలను 12 నుంచి 15 శాతం పెంచింది. అయితే ఏప్రిల్ నుంచి పెంచే జీతాలు అందరికీ వర్తిస్తాయా? లేక కొందరికేనా? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. కొన్ని ఐటీ కంపెనీలు ప్రస్తుత డౌన్‌ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని జీతాలు పెంపు మానేశాయి. కొన్ని కంపెనీలైతే పనితీరు ఆధారంగా ఇచ్చే వేరియబుల్ జీతాల్లోనూ కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ తన ఉద్యోగుల జీతాలు కొద్ది స్థాయిలోనైనా పెంచడం విశేషం. అయితే టీసీఎస్ మాత్రం ఈ జీతాల పెంపు వార్తలు పుకార్లని కొట్టివేసింది. జీతాల పెంపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలిపింది.