Share News

టెక్‌ వ్యూ : 24,000 పైన నిలదొక్కుకోవాలి

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:22 AM

నిఫ్టీ గత వారం 23,400 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమైనా తక్షణం పునరుజ్జీవం సాధించింది. తదుపరి అన్ని ట్రేడింగ్‌ దినాల్లోనూ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ శుక్రవారం ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 24,150 వరకు...

టెక్‌ వ్యూ  : 24,000 పైన  నిలదొక్కుకోవాలి

టెక్‌ వ్యూ : 24,000 పైన నిలదొక్కుకోవాలి

నిఫ్టీ గత వారం 23,400 వద్ద రియాక్షన్‌తో ప్రారంభమైనా తక్షణం పునరుజ్జీవం సాధించింది. తదుపరి అన్ని ట్రేడింగ్‌ దినాల్లోనూ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ శుక్రవారం ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 24,150 వరకు వెళ్లి మైనర్‌ రియాక్షన్‌కు గురైంది. అయినప్పటికీ వారం మొత్తంలో 510 పాయింట్ల లాభంతో 24,000 సమీపంలో నిలకడగా ముగిసింది. మొత్తం మీద నిఫ్టీ జూన్‌ నెల మొత్తం బలమైన ర్యాలీలో ట్రేడవుతూ 2,800 పాయింట్ల వరకు లాభపడింది. ఈ కారణంగా ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో టెక్నికల్‌ కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ ఏర్పడవలసి ఉంది. గత వారంలో మిడ్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 300 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 80 పాయింట్లు లాభపడ్డాయి. జూన్‌ నెలలో ఏర్పడిన ర్యాలీ ఏ గ్రూప్‌ షేర్ల కారణంగానే ఏర్పడిందనేందుకు ఇది సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్‌ ఓవర్‌బాట్‌ స్థితిలో ప్రవేశిస్తోంది.


బుల్లిష్‌ స్థాయిలు: 24,000 పాయింట్ల స్థాయిలో మార్కెట్‌ కన్సాలిడేట్‌ కావచ్చు. సానుకూలత కోసం ఈ స్థాయిలో బలాన్ని ప్రదర్శించాలి. మరింత అప్‌ట్రెండ్‌లో ట్రేడయి గురువారం ఏర్పడిన గరిష్ఠ స్థాయి, ప్రధాన నిరోధం 24,150 వద్ద బ్రేకౌట్‌ సాధిస్తే సరికొత్త శిఖరాల దిశగా సాగుతుంది.

బేరిష్‌ స్థాయిలు: కరెక్షన్‌లో పడినా భద్రత కోసం మైనర్‌ మద్దతు స్థాయి 23,800 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మైనర్‌ బలహీనత మరింతగా కొనసాగుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 23,650, 23,500.

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీ గత వారం కనిష్ఠ స్థాయి 51,200 నుంచి ర్యాలీ సాధించి 53,200 వరకు వెళ్లింది. కాని గత శుక్రవారం ఈ స్థాయిలో 470 పాయింట్ల మేరకు రియాక్షన్‌ సాధించడం అప్రమత్త సంకేతం. అయినా గత వారంతో పోల్చితే 680 పాయింట్ల లాభంతో ముగిసింది. నిరోధ స్థాయిలు 52,700, 53,000. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 51,700, 51,000.


పాటర్న్‌: ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం డెయిలీ చార్టులు, మంత్లీ చార్టులు రెండింటిలోనూ ఓవర్‌బాట్‌ స్థితి కనిపిస్తోంది. స్వల్పకాల ఇన్వెస్టర్లు ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలనేందుకు ఇది సంకేతం. 23,800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది. అలాగే ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌కు కూడా ఆస్కారం ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,090, 24,150

మద్దతు : 23,940, 23,860

వి. సుందర్‌ రాజా

Updated Date - Jul 01 , 2024 | 05:22 AM