Share News

టెక్‌ వ్యూ : 24500 పైన నిలదొక్కుకోవాలి

ABN , Publish Date - Nov 04 , 2024 | 05:53 AM

నిఫ్టీ గత వారం ప్రారంభంలో 24000 పైన రికవరీ సాధించి 24500 వరకు వెళ్లింది. కాని ఆ స్థాయిలో నిలదొక్కుకోలేక కరెక్షన్‌లో పడి చివరికి 24300 వద్ద ముగిసింది. గత వారం పరిమిత...

టెక్‌ వ్యూ : 24500 పైన నిలదొక్కుకోవాలి

టెక్‌ వ్యూ : 24500 పైన నిలదొక్కుకోవాలి

నిఫ్టీ గత వారం ప్రారంభంలో 24000 పైన రికవరీ సాధించి 24500 వరకు వెళ్లింది. కాని ఆ స్థాయిలో నిలదొక్కుకోలేక కరెక్షన్‌లో పడి చివరికి 24300 వద్ద ముగిసింది. గత వారం పరిమిత పరిధిలోనే కదలాడుతూ వారం మొత్తం మీద అనిశ్చిత ట్రెండ్‌లో క్లోజయింది. టెక్నికల్‌గా మార్కెట్‌ ఇప్పటికీ డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. గత వారం మిడ్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 1200 పాయింట్ల మేరకు లాభపడింది. అయితే అక్టోబరు నెల మొత్తం మీద 4000 పాయింట్లు నష్టపోయింది. స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ కూడా పునరుజ్జీవం సాధించి 950 పాయింట్ల మేరకు లాభపడింది. నిఫ్టీ ఇప్పటికీ ప్రధాన మానసిక అవధి 24000 వద్ద అప్రమత్త ధోరణిలో నిలిచి ఉంది. శుక్రవారం అమెరికన్‌ మార్కెట్ల కదలికల ఆధారంగా నిఫ్టీ ఈ వారంలో నెగెటివ్‌గానే ప్రారంభమై మద్దతు స్థాయిల వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ట్రెండ్‌లో ప్రారంభమైతే ఎగువన 24420 వద్ద మైనర్‌ నిరోధం, 24500 వద్ద ప్రధాన నిరోధం ఉన్నాయి. గత వారం ఏర్పడిన గరిష్ఠ స్థాయి 24500 వద్దనే సూచీ నిలదొక్కుకోలేక కరెక్షన్‌లో పడింది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుంది.

బేరిష్‌ స్థాయిలు: మైనర్‌ మద్దతు స్థాయి 24150 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 24000. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత కొనసాగుతున్నట్టుగా భావించి స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం 900 పాయింట్ల మేరకు రికవరీ సాధించినా వారం మధ్య స్థాయిలో 51670 వద్ద అనిశ్చితంగా క్లోజయింది. మరింత సానుకూలత కోసం ప్రధాన నిరోధం 52000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 51000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు.


పాటర్న్‌: నిఫ్టీ 100 డిఎంఏ 24500 వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఆ పైన నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రేఖ’’ కన్నా స్వల్పంగా దిగువన ఉంది. సానుకూలత కోసం దాన్ని బ్రేక్‌ చేయాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,420, 24,500

మద్దతు : 24,220, 24,150

వి. సుందర్‌ రాజా

Updated Date - Nov 04 , 2024 | 05:53 AM