Share News

టెక్‌ వ్యూ : కరెక్షన్‌కు చాన్స్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:26 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ట్రెండ్‌లో ప్రారంభమై కీలకమైన 24,000 కన్నా పైన నిలదొక్కుకుని మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించింది.ఆ క్రమం లో 24,400 వరకు వెళ్లి మైనర్‌ రియాక్షన్‌కు గురైనా...

టెక్‌ వ్యూ : కరెక్షన్‌కు చాన్స్‌

టెక్‌ వ్యూ : కరెక్షన్‌కు చాన్స్‌

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ట్రెండ్‌లో ప్రారంభమై కీలకమైన 24,000 కన్నా పైన నిలదొక్కుకుని మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించింది.ఆ క్రమం లో 24,400 వరకు వెళ్లి మైనర్‌ రియాక్షన్‌కు గురైనా వారం మొత్తం మీద 310 పాయింట్లు లాభపడి 24,320 వద్ద పటిష్ఠంగా ముగిసింది. గత ఎనిమిది వారాలుగా సాగుతున్న ర్యాలీలో 21,300 (జూన్‌ 4వ తేదీన ఏర్పడిన మహాపతనంలో నమోదైన ఇంట్రాడే కనిష్ఠ స్థాయి) నుంచి 3,000 పాయింట్ల మేరకు లాభపడింది. ప్రతీ ఒక్క నిరోధ స్థాయిలోనూ బలంగా నిలదొక్కుకుంటూ ఆ నిరోధాలను ఛేదించుకుంటూ అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. టెక్నికల్‌గా మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లోనే ఉన్నప్పటికీ స్వల్పకాలిక ఇన్వెస్టర్లు ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి. ర్యాలీకి దీటుగా కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ ఏర్పడడం తప్పనిసరి. కాగా అదే ధోరణిని కొనసాగించిన మిడ్‌క్యాప్‌-100 సూచీ 1,350 పాయుంట్లు, స్మాల్‌క్యాప్‌-100 సూచీ 620 పాయింట్లు లాభపడ్డాయి.


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయి 24,410 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం, మానసిక అవధి 24,550.

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌లో పడినా మైనర్‌ మద్దతు స్థాయి 24,150 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మైనర్‌ బలహీనతకు ఆస్కారం ఉంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,950.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం మైనర్‌ అప్‌ట్రెండ్‌ సాధించిన ఈ సూచీ 320 పాయింట్లు లాభపడి గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు నడుమన 52,660 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడుతోందనేందుకు ఇది సంకేతం. మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 53,100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనత ప్రదర్శించినట్టయితే 52,300, 51,900 వద్ద గట్టి మద్దతు స్థాయిలున్నాయి.

పాటర్న్‌: మార్కెట్లో ఓవర్‌బాట్‌ స్థితి కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలి. రియాక్షన్‌లో పడి 24,150 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతకు ఆస్కారం ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,410, 24,470

మద్దతు : 24,250, 24,190

వి. సుందర్‌ రాజా

Updated Date - Jul 08 , 2024 | 06:26 AM