Share News

Tech View: Weak below 23,400

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:35 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై 23,600 స్థాయిని దాటినప్పటికీ తదుపరి నాలుగు సెషన్లలో పలు ఇంట్రాడే రియాక్షన్ల కారణంగా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. పలు ప్రయత్నాలు చేసినా...

Tech View: Weak below 23,400

టెక్‌ వ్యూ : 23,400 దిగువన బలహీనం

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై 23,600 స్థాయిని దాటినప్పటికీ తదుపరి నాలుగు సెషన్లలో పలు ఇంట్రాడే రియాక్షన్ల కారణంగా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. పలు ప్రయత్నాలు చేసినా నిలదొక్కుకోలేకపోవడం వల్ల ఇది బలమైన నిరోధ స్థాయిగా మారింది. ఇప్పుడు ఈ స్థాయి కీలకంగా మారింది. కాని అన్ని కరెక్షన్లలోనూ మద్దతు స్థాయిల కన్నా పైనే ఉండడం వల్ల ఇప్పటికీ అప్‌ట్రెండ్‌లోనే ఉంది. గతవారం పరిమిత పరిధిలో 23,650, 23,400 పాయింట్ల మధ్యన కదలాడి ఎట్టకేలకు 35 పాయింట్ల స్వల్పలాభంతో 23,500 వద్ద ముగిసింది. గత వారంలో మిడ్‌క్యాప్‌-100 సూచీ 200 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 సూచీ 190 పాయింట్లు లాభపడ్డాయి. ఏది ఏమైనా గత వారంలో గరిష్ఠ స్థాయిల్లో ఎలాంటి భారీ కదలికలు లేకుండా అనిశ్చిత స్థితిని ప్రదర్శించింది.


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించి సరికొత్త శిఖరాలకు చేరాలంటే ప్రధాన నిరోధం 23,650 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మానసిక అవధులు 23,800, 24,000.

బేరిష్‌ స్థాయిలు: కరెక్షన్‌లో పడి మైనర్‌ మద్దతు స్థాయి 23,400 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనత ఉన్నట్టు సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,400. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మరో ప్రధాన మద్దతు స్థాయి 23,000. ఇది స్వల్పకాలిక బలహీనత సంకేతం.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం బలమైన ర్యాలీ సాధించి 1,650 పాయింట్ల మేరకు లాభపడింది. 52,000 వరకు వెళ్లి మైనర్‌ రియాక్షన్‌ సాధించింది. ఇదే ప్రధాన నిరోధ స్థాయి అయింది. మ రింత అప్‌ట్రెండ్‌ కోసం అంతకన్నా పైన నిలదొక్కుకోవాలి. మద్దతు స్థాయి 51,300.ప్రధాన మద్దతు స్థాయి 51,000.

పాటర్న్‌: సానుకూలత కోసం మార్కెట్‌ 23,650 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను బ్రేకర్‌ చేయాలి. 23,400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది. అలాగే ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌కు కూడా ఆస్కారం ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,580, 23,650

మద్దతు : 23,455, 23,400

వి. సుందర్‌ రాజా

Updated Date - Jun 24 , 2024 | 06:35 AM