Share News

టర్మ్‌ పాలసీలు మరింత ప్రియం

ABN , Publish Date - Jul 11 , 2024 | 01:48 AM

జీవితానికి జరగరానిది ఏమైనా జరిగితే ఆదుకునే టర్మ్‌ పాలసీలు మరింత ప్రియంగా మారాయి. కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఈ పాలసీల ప్రీమియాన్ని పది శాతం వరకు పెంచేశాయి...

టర్మ్‌ పాలసీలు మరింత ప్రియం

ప్రీమియం 10 శాతం వరకు పెంచిన కంపెనీలు

న్యూఢిల్లీ: జీవితానికి జరగరానిది ఏమైనా జరిగితే ఆదుకునే టర్మ్‌ పాలసీలు మరింత ప్రియంగా మారాయి. కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఈ పాలసీల ప్రీమియాన్ని పది శాతం వరకు పెంచేశాయి. మిగతా బీమా కంపెనీలూ త్వరలో ఇదే బాట పడతాయని పరిశ్రమ వర్గాల అంచనా. ఆరు పదుల వయసు దాటిన వారి టర్మ్‌ పాలసీల ప్రీమియం మరింత ప్రియంగా మారనుంది. బీమా కంపెనీల వార్షిక ప్రీమియం వసూళ్లలో టర్మ్‌ పాలసీల ప్రీమియం వాటా ఐదు శాతం మాత్రమే. అయినా బీమా కంపెనీలు ఈ పాలసీల ప్రీమియం పెంచేయడం విశేషం.


కంపెనీల వారీగా: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మ్యాక్స్‌ లైఫ్‌, బజాజ్‌ అలయెన్స్‌, టాటా ఏఐఏ కంపెనీలు ఇప్పటికే తమ టర్మ్‌ పాలసీల ప్రీమియం 10 శాతం వరకు పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీ 60 ఏళ్ల వయసు పైబడిన వారి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియాన్ని 10 శాతం వరకు పెంచింది. మ్యాక్స్‌ లైఫ్‌ కంపెనీ కూడా అన్ని వయసుల వారి టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది. టాటా ఏఐఏ అన్ని వయసుల వారి టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని మూడు నుంచి 10 శాతం పెంచింది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్పూరెన్స్‌ కంపెనీ కూడా త్వరలో తన టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని మూడు నుంచి ఐదు శాతం పెంచబోతున్నట్టు సమాచారం.

ఎందుకంటే?

  • పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా టర్మ్‌ పాలసీల ప్రీమియాన్ని సర్దుబాటు చేయాల్సి రావడం.

  • రిస్క్‌ కవరేజి ఎక్కుగా ఉండే టియర్‌- 2 కవరేజిలు పెరిగిపోవడం.

  • రీ-ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు కూడా పెరిగిపోవడం.

Updated Date - Jul 11 , 2024 | 01:48 AM