ఐటీఆర్‌లో తేడాలుంటే ఎస్‌ఎంఎస్‌లు
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:31 AM
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. 2021-22, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేశారా? లేదా?...
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. 2021-22, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేశారా? లేదా? ఫైల్ చేసినా మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌లోని ఆదాయ, ఖర్చుల లావాదేవీలు.. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్) లోని లావాదేవీల మధ్య తేడాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఇలాంటి పన్ను చెల్లింపుదారులను ఇప్పటికే గుర్తించి, తేడాలను సరిదిద్దుకోవాలని వారి మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్స్‌కు సందేశాలు పంపించింది. ఈ-వెరిఫికేషన్ స్కీమ్, 2021లో భాగంగా ఈ ప్రచారం చేపట్టినట్టు సీబీడీటీ తెలిపింది. ఐటీఆర్-ఏఐఎస్ మధ్య తేడాలు ఉన్న ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఆ తేడాలను సరిదిద్దుకుని ఈ నెలాఖరులోగా తమ ఐటీఆర్‌లు మళ్లీ ఫైల్ చేయాలని కోరింది.