Share News

పసిడి దిగొచ్చింది..

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:16 AM

బులియన్‌ ధరలు క్రమంగా కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం రూ.1,750 తగ్గుదలతో రూ.77,800కు జారుకుంది. కిలో వెండి రూ.2,700 తగ్గి రూ.91,300కు పరిమితమైంది...

పసిడి దిగొచ్చింది..

రూ.77,800కు 10 గ్రా. ధర

కిలో వెండి రూ.2,700 డౌన్‌

ఒక్కరోజే రూ.1,750 తగ్గుదల

న్యూఢిల్లీ: బులియన్‌ ధరలు క్రమంగా కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం రూ.1,750 తగ్గుదలతో రూ.77,800కు జారుకుంది. కిలో వెండి రూ.2,700 తగ్గి రూ.91,300కు పరిమితమైంది. బంగారం, వెండి రేటు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గడంతో పాటు దేశీయంగానూ జువెలర్ల నుంచి డిమాండ్‌ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. కాగా, అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 2,600 డాలర్లకు పడిపోగా.. వెండి 30.43 డాలర్లకు తగ్గింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడంతో అంతర్జాతీయంగా డాలర్‌ బలం పుంజుకుంది. ఇందుకు తోడు, ట్రంప్‌ మలివిడత పాలనలో రష్యా-ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలకు తెరపడేందుకు అవకాశాలు పెరగడంతో


అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండికి డిమాండ్‌కు ఒక్కసారిగా పడిపోయింది. ఔన్స్‌ గోల్డ్‌ ఈ మధ్య నమోదు చేసిన ఆల్‌టైం రికార్డు స్థాయి 2,800 డాలర్ల స్థాయి నుంచి 200 డాలర్ల మేర క్షీణించింది. మున్ముందు మరింత తగ్గి 2,500 డాలర్లకు పడిపోవచ్చన్న అంచనాలున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 04:16 AM