పసిడి మళ్లీ కొండెక్కుతోంది..
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:46 AM
దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.1,400 పెరుగుదలతో రూ.79,300కు చేరుకుంది. కిలో వెండి మాత్రం ఏ మార్పు లేకుండా...
దేశీయంగా బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.1,400 పెరుగుదలతో రూ.79,300కు చేరుకుంది. కిలో వెండి మాత్రం ఏ మార్పు లేకుండా రూ.93,000 ధర పలికింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైన లోహానికి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 0.74 శాతం పెరిగి 2,695 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్ 31.53 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు 93% బిడ్లు
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓకు రెండో రోజు నాటికి 93 శాతం సబ్‌స్ర్కిప్షన్ లభించింది. రిటైల్ మదుపరుల కోసం కేటాయించిన షేర్లకు మాత్రం 2.38 రెట్ల బిడ్లు లభించాయి.
వాహన పరికరాల తయారీ సంస్థ బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ఐపీఓ ద్వారా రూ.2,150 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.