మార్కెట్‌లో ‘డ్రీమ్’ రిస్ట్ ఫోన్ ధర రూ.5,999
ABN , Publish Date - Jan 11 , 2024 | 03:36 AM
స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడా చెరిగిపోనుంది. ఈ రెండు పనులు ‘రిస్ట్‌ఫోన్’ అనే ఒకే వస్తువు చేయనుంది. ఫైర్‌బోల్ట్ కంపెనీ భారత మార్కెట్‌లో తొలిసారిగా ‘డ్రీమ్’ పేరుతో ఈ వినూత్న పరికరాన్ని...
న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడా చెరిగిపోనుంది. ఈ రెండు పనులు ‘రిస్ట్‌ఫోన్’ అనే ఒకే వస్తువు చేయనుంది. ఫైర్‌బోల్ట్ కంపెనీ భారత మార్కెట్‌లో తొలిసారిగా ‘డ్రీమ్’ పేరుతో ఈ వినూత్న పరికరాన్ని విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఆండ్రాయిడ్ రిస్ట్‌ఫోన్ ధర రూ.5,999. ఈ రిస్ట్‌ఫోన్‌ని స్మార్ట్‌ఫోన్‌గా, స్మార్ట్ రిస్ట్‌వాచ్‌గా ఉపయోగించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈ రిస్ట్‌ఫోన్ లభించనుంది.
‘డ్రీమ్’ రిస్ట్‌ఫోన్ ఫీచర్లు : 4జీ ఎల్‌టీఈ నానో సిమ్; కాలింగ్, మెసేజింగ్‌తో పాటు యూట్యూబ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా యాప్స్, 2.02 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 2 జీబీ రామ్‌తో కూడిన కార్టెక్స్ క్వాడ్ కోర్ సీపీయూ, 16 జీబీ స్టోరేజి, వైఫై, జీపీఎస్ వంటి సదుపాయాలు.