కొలువుల కల్పనలో ప్రైవేటు రంగం బాధ్యత కీలకం
ABN , Publish Date - Jul 25 , 2024 | 04:55 AM
దేశంలో ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగానికి కూడా బాధ్యత ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బడ్జెట్లో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన...
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగానికి కూడా బాధ్యత ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అన్నారు. బడ్జెట్లో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ చర్యలకు అనుగుణం గా, ప్రైవేటు రంగం కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన దీనికి సంబంధించి తన అభిప్రాయాలు పోస్టు చేశారు. బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా యువకుల నైపుణ్యాలకు సాన పెట్టాలని కోరారు. లేకపోతే మన అధిక జనాభా వరంగా గాక, పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని ఆనంద్ మహీంద్ర హెచ్చరించారు. ప్రస్తుత సంక్షుభిత ప్రపంచంలో మన అధిక జీడీపీ వృద్ధిరేటు అందరికీ కన్ను కుట్టేలా ఉందన్నారు. అయినా మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు ఆసక్తితో ఉన్నాయన్నారు.