వచ్చే మార్చి నాటికి 50 స్టోర్లు టార్గెట్
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:38 AM
విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ రివర్ వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 50 స్టోర్ల ఏర్పా టు లక్ష్యంగా పెట్టుకుంది...
రివర్ ఈవీ సీఈఓ అరవింద్ మణి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ రివర్ వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో 50 స్టోర్ల ఏర్పా టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బెంగళూరులో రెండు స్టోర్లు నిర్వహిస్తున్న ఆ కంపెనీ బుధవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తొలి స్టోర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ మణి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈవీలకు మంచి డిమాండు ఉన్నదని, అందుకే బెంగళూరు వెలుపల తొలి స్టోర్‌ను ఇక్కడ ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా 30 స్కూటర్లను కస్టమర్లకు అందించామని ఇక్కడ 500 ఈవీలకు ఆర్డర్ చేతిలో ఉన్నదని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న స్టోర్లలో మరో మూడు హైదరాబాద్‌లో ఉంటాయని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కూడా స్టోర్లు ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు.
తమ విద్యుత్ స్కూటర్ ఇండీ ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ..1,38,000 అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులో తమ ఫ్యాక్టరీ ఉన్నదంటూ, 2026 నాటికి మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే యోచన ఉన్నదని, అందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ర్టాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.