కార్యాలయ భవనాలకు భలే డిమాండ్
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:47 AM
జీడీపీ వృద్ధి రేటు తగ్గినా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ భవనాల లీజులు మాత్రం 2024లో భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు హైదరాబాద్‌తో సహా దేశంలోని...
హైదరాబాద్‌లో 56ు అప్
కోలియర్స్ ఇండియా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీడీపీ వృద్ధి రేటు తగ్గినా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో కార్యాలయ భవనాల లీజులు మాత్రం 2024లో భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు హైదరాబాద్‌తో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో 6.64 కోట్ల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణం ఉన్న కార్యాలయాల భవనాల లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ కోలియర్స్ ఇండియా వెల్లడించింది. లీజు ఒప్పందాల పునరుద్దరణ, కేవలం లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే ఇచ్చిన లీజు ఒప్పందాలను ఇందులో చేర్చలేదు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 1.25 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్ లీజుకు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 56 శాతం ఎక్కువ.
గత ఏడాది దేశంలో మరే నగరంలోనూ లీజుకు ఇచ్చిన ఆఫీసు స్పేస్ వృద్ధి రేటు ఇంత భారీగా పెరగలేదని కోలియర్స్ తెలిపింది. లీజుకు ఇచ్చిన ఆఫీస్ స్పేస్ విస్తీర్ణం పరంగా చూస్తే ఈ విషయంలో 2.17 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీతో బెంగళూరు ముందుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం మాత్రమే ఎక్కువ. ఇదే సమయంలో ముంబై, పుణెల్లోనూ ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాల్లో వృద్ధి కనిపించింది.