Share News

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 06:57 AM

బంగారం ధరలో మార్పులు, చేర్పులు ఉంటాయనేది తెలిసిన విషయమే కానీ ఈ రేంజ్‌లో మార్పులు చేర్పులు అయితే ఊహించడం కష్టమే. గత మూడు రోజులుగా బంగారం ధర పెరిగితే 10 గ్రాముల మీద రూ.10 పెరుగుతోంది. తగ్గితే రూ.10 తగ్గుతుంది.

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price: బంగారం ధరలో మార్పులు, చేర్పులు ఉంటాయనేది తెలిసిన విషయమే కానీ ఈ రేంజ్‌లో మార్పులు చేర్పులు అయితే ఊహించడం కష్టమే. గత మూడు రోజులుగా బంగారం ధర పెరిగితే 10 గ్రాముల మీద రూ.10 పెరుగుతోంది. తగ్గితే రూ.10 తగ్గుతుంది. పెళ్లిళ్ల సీజన్‌ కాబట్టి బంగారం ధర తగ్గితే బాగుండు అని అంతా భావిస్తూ ఉంటారు. వారికి మాత్రం ఇది కాస్త ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే రూ.10 పెరగడమో, తగ్గడమో అనేది పరిగణలోకి తీసుకోలేం. స్థిరంగా ఉన్నట్టే లెక్క. పెరగలేదు అనుకుని సరిపెట్టుకోవాలి.

ఇవాళ బంగారం ధర 10 గ్రాములపై రూ.10 తగ్గింది. ఇక నేడు 22 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,990 ఉండగా.. 24 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,220గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కూడా బంగారం ధర 10 గ్రాములు పై విధంగానే ఉంది. మార్పేమీ లేదు. వెండి విషయానికి వస్తే కిలోపై రూ.1000 మేర తగ్గింది. నేడు హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.75,000గా ఉంది.

Updated Date - Feb 09 , 2024 | 06:57 AM