Gold and Silver Price: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2024-02-07T07:12:00+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్‌లో బంగారం ధర తగ్గితే బాగుండని అంతా అనుకుంటూ ఉంటారు.
Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్‌లో బంగారం ధర తగ్గితే బాగుండని అంతా అనుకుంటూ ఉంటారు. అందరి ఆశలకు అనుగుణంగానే బంగారం ధరలు అయితే తగ్గాయి. ఇక ఎంత తగ్గాయో తెలిస్తే మాత్రం షాక్ అవడం ఖాయం. నేడు బంగారం ధర 10 గ్రాములపై కేవలం రూ.10 తగ్గింది. అసలు దీన్ని తగ్గింది అని కూడా అనలేము. ఇక వెండి విషయానికి వస్తే కాస్త బెటర్‌గానే తగ్గింది. కిలో వెండిపై రూ.1000 మేర తగ్గింది.
నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 57,740గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,990గా ఉంది. ఇక వెండి ధర కిలో రూ.73.500కి చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్‌లో, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరల్లో మార్పేమీ లేదు. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 57,740గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,990గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో రూ.75,000గా ఉంది.