Share News

ఈ షేర్లే తారా జువ్వలు

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:39 AM

ప్రస్తుతం స్టాక్‌మార్కెట్‌లో దిద్దుబాటు కొనసాగుతోంది. అయినా గత ఏడాది దీపావళితో పోలిస్తే నిఫ్టీ ఇప్పటి వరకు మదుపరులకు దాదాపు 25 శాతం లాభాలు పంచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో...

ఈ షేర్లే తారా జువ్వలు

పెట్టుబడులకు ఇదే అదును

ప్రస్తుతం స్టాక్‌మార్కెట్‌లో దిద్దుబాటు కొనసాగుతోంది. అయినా గత ఏడాది దీపావళితో పోలిస్తే నిఫ్టీ ఇప్పటి వరకు మదుపరులకు దాదాపు 25 శాతం లాభాలు పంచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో కొనేందుకు కొన్ని కంపెనీల షేర్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సంవత్‌, 2081 ట్రేడింగ్‌ రోజు పెట్టుబడి లాభాల కోసం వివిధ బ్రోకరేజి సంస్థలు రికమండ్‌ చేసిన కొన్ని కంపెనీల షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి

ఐసీఐసీఐ బ్యాంక్‌

సంవత్‌ 2080 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 45 శాతం లాభాలు పంచాయి. 2021 ఫిబ్రవరితో పోల్చినా ఈ కౌంటర్‌ మదుపరులకు 158 శాతం లాభాలు పంచింది. ఈ షేర్లు బుధవారం రూ.1,312 వద్ద ముగిశాయి. ప్రస్తుతం దిద్దుబాటులో ఉన్న ఈ షేర్లను రూ.1,773 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లా్‌స రూ.1,215-1,150.


ఐటీసీ

ఐటీసీ షేరు కూడా ప్రస్తుతం ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. బుధవారం రూ.491 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌కు రూ.460-445 వద్ద గట్టి మద్దతు కనిపిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో రూ.633 టార్గెట్‌తో పొజిషన్లు తీసుకోవచ్చు. రెసిస్టెన్స్‌ రేంజి : రూ.545, రూ.579

మాక్రోటెక్‌ డెవలపర్స్‌

గత నాలుగు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ షేరు బుధవారం రూ.1,182 వద్ద ముగిసింది. గత ఏడాది జూన్‌ తర్వాత ఈ కంపెనీ షేర్లు 20 నెలల సగటు కంటే దిగువన ట్రేడవడం ఇదే తొలిసారి. రూ.974 స్టాప్‌లా్‌సతో రూ.1,600 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. రెసిస్టెన్స్‌ రేంజి : రూ.1,310, రూ.1,380.

వరుణ్‌ బేవరేజేస్‌

ఈ కంపెనీ షేర్లు బుధవారం రూ.606 వద్ద ముగిశాయి. 2018 ఏప్రిల్‌లో రూ.37 వద్ద ట్రేడైన ఈ కంపెనీ షేర్లు, ఇప్పటి వరకు మదుపరులకు 1700 శాతం లాభాలు పంచాయి. రూ.527 వద్ద గట్టి మద్దతు లభిస్తోంది. టెక్నికల్‌ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరు రూ.922 వరకు పెరగవచ్చు. రెసిస్టెన్స్‌ రేంజి : రూ.727, రూ.800.


థైరోకేర్‌ టెక్నాలజీస్‌

ఈ షేర్లు బుధవారం రూ.949 వద్ద ముగిశాయి. ఈ ఏడాది జూలై నుంచి బ్రేకౌట్‌ కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లోనే మదుపరులకు 53 శాతం లాభాలు పంచాయి. రూ.905పైన ట్రేడైనంత వరకు ఈ కౌంటర్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని భావించవచ్చు. సంవత్‌ 2081లో కంపెనీ షేర్లు 47.2 శాతం లాభంతో రూ.1,400 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెసిస్టెన్స్‌ రేంజి : రూ.1,125, రూ.1,230. ఒకవేళ రూ.905 కంటే దిగువకు వస్తే రూ.850-790 మధ్య గట్టి మద్దతు లభిస్తుందని భావించాలి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ఆర్‌ఐఎల్‌ షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. 1:1 బోనస్‌ తర్వాత బ్రోకరేజి సంస్థలు మరింతగా ఈ కౌంటర్‌పై దృష్టి పెట్టాయి. ఈ గ్రూప్‌నకు వచ్చే 3-4 సంవత్సరాల్లో జియో, రిటైల్‌ వ్యాపారాలు మరింత దన్నుగా నిలవబోతున్నాయి. ఇది చాలదన్నట్టు హరిత ఇంధనాల పై సైతం కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో 2024-27 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్‌ నికర లాభాలు ఏటా 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.1,344 వద్ద ట్రేడవుతున్న ఆర్‌ఐఎల్‌ షేర్లు వచ్చే 6-12 నెలల్లో మదుపరులకు 28 శాతం వరకు లాభాలు పంచే అవకాశం ఉంది.


పవర్‌గ్రిడ్‌

పెట్డుబడులకు పెద్దగా ఢోకా లేకుండా, స్థిరమైన రాబడులు, లాభాల కోసం చూసే మదుపరులకు పవర్‌గ్రిడ్‌ కంపెనీ షేర్లు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు రూ.318 వద్ద ట్రేడవుతున్నాయి. వచ్చే 6-12 నెలల్లో రూ.383 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. పీఎ్‌సయూ కావడంతో ఏటా వచ్చే లాభాల నుంచి మంచి డివిడెండ్‌ కూడా చెల్లిస్తోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌

మదుపరులకు మంచి లాభాలు పంచిన అతి కొద్ది కంపెనీల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ ఒకటి. ప్రస్తుతం రూ.6,955 వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఆరు నుంచి 12 నెలల్లో రూ.8,552 టార్గెట్‌తో పొజిషన్లు తీసుకోవచ్చు.


ఐసిఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ప్రైవేట్‌ బీమా కంపెనీల్లో మోటార్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లో కంపెనీదే హవా. ఫైర్‌, ఇంజినీరింగ్‌, మెరైన్‌, లయబిలిటీ ఇన్సూరెన్స్‌లోనూ కంపెనీకి మంచి పట్టుంది. ప్రస్తుతం ఈ షేరు రూ.1,928 వద్ద ట్రేడవుతోంది. వచ్చే 6-12 నెలల్లో రూ.2,450 టార్గెట్‌తో మదుపరులు పొజిషన్లు తీసుకోవచ్చు.

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌

దేశంలోని ప్రముఖ స్టీల్‌ కంపెనీ జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 96 లక్షల టన్నులు. దీన్ని 2026 మార్చి నాటికి 159 లక్షల టన్నులకు విస్తరించే పనిలో ఉంది. కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ.919 వద్ద కోట్‌ అవుతున్నాయి. వచ్చే ఆరు నుంచి 12 నెలల్లో రూ.1,150 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు.

Updated Date - Oct 31 , 2024 | 01:39 AM